: అఖిల్ సినిమాలో నాగార్జున, నాగచైతన్య ఉన్నారా?


'అఖిల్' సినిమాలో తన తండ్రి, అన్న ఉన్నారో లేరో గుర్తుకు రావడం లేదని వర్ధమాన సినీ నటుడు అఖిల్ అక్కినేని చమత్కరించాడు. 'అఖిల్' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, సినిమాలో చివరి పాట 'అక్కినేని' నేపథ్యంలో సాగుతుందని తెలిపాడు. ఈ పాటలో మాస్ స్టెప్స్ ఉంటాయని అఖిల్ చెప్పాడు. కుటుంబ నేపథ్యంలో సాగిన పాట కనుక ఈ పాటలో అక్కినేని నటులు కనువిందు చేసే అవకాశం ఉందా? అని అడుగగా, అది సినిమా చూసి తెలుసుకోవాలని అన్నాడు. పాటను షూట్ చేసి సుదీర్ఘకాలం అయినందున తనకు గుర్తులేదని అఖిల్ నవ్వుతూ చెబుతూ, తప్పించుకున్నాడు. అఖిల్ మాటలను బట్టి చూస్తే 'మనం' సినిమాలోలా చివర్లో అక్కినేని నాగార్జున, నాగచైనత్య కనువిందు చేసే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News