: బీహార్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఎన్డీయేదే: అమిత్ షా
బీహార్ శాసనసభ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఎన్డీయే కూటమిదే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 8వ తేదీన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయక తప్పదని అన్నారు. ఈ రోజు శరన్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంత్రాలు, తంత్రాల గురించి మాట్లాడుతున్నారని... అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. లాలూ, నితీష్ లు కలసి బీహార్ ను ఎలా ముందుకు తీసుకువెళతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.