: బాలీవుడ్ సీనియర్ నటీమణుల పొగడ్తల ముచ్చట్లు
బాలీవుడ్ సీనియర్ నటీమణులు షబానా అజ్మీ, జూహీ చావ్లా ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకుంటున్నారు. 'చాక్ అండ్ డస్టర్' సినిమాలో నటిస్తున్న వీరిద్దరూ సామాజిక మాధ్యమం వేదికగా ఇలా పొగడ్తలు కురిపించుకునేందుకు కారణముంది. ఈమధ్య జూహీ చావ్లా జలుబు, దగ్గుతో బాధపడింది. ముందులు వేసుకున్నా తక్షణం ఉపశమనం లభించక తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆమె అవస్థ గమనించిన షబానా, కాస్త మరిగించిన నీటిలో పసుపు కలుపుకుని, ఆ నీళ్లు తాగమని సలహా ఇచ్చింది. ఈ చిట్కా బ్రహ్మాండంగా పని చేసింది. దీంతో జూహీ సంబరపడిపోతూ షూటింగ్ స్పాట్ కి విందు భోజనం తయారు చేసి తీసుకెళ్లింది. అది తిన్న షబానా ఇంత రుచికరమైన గుజరాతీ భోజనం ఇంతకు ముందు చేయలేదని, పెదాలు ఇప్పటికీ నాక్కుంటున్నానని జూహీని పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ సంభాషణ వారి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.