: సఫారీలా...టీమిండియానా...సత్తా చాటేదెవరు?


భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో అంతిమ సమరం ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపు జరగనుంది. ఇప్పటి వరకు సిరీస్ లో 2-2తో రెండు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. టీట్వింటీ సిరీస్ ను సఫారీలు ఎగురేసుకుపోయిన నేపథ్యంలో వన్డే సిరీస్ ను గెలిచి సత్తా చాటాలని భారత్ భావిస్తోంది. దీంతో రెండు జట్ల కెప్టెన్లు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నారు. కోహ్లీ, రైనా, ధోనీ ముగ్గురూ ఫాం లోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఓపెనర్లిద్దరూ సత్తాచాటితే భారత్ భారీ స్కోరు సాధిస్తుందని ధోనీ అభిప్రాయపడుతున్నాడు. తరువాత సఫారీల పని పట్టేందుకు భజ్జీ, అక్సర్, మిశ్రా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాడు. ఇదే సమయంలో మొదటి, మూడో వన్డేల్లో చేసిన ప్రదర్శన పునరావృతం చేసి వన్డే సిరీస్ ను గెలుచుకుంటామని డివిలియర్స్ చెబుతున్నాడు. సిరీస్ ను చేజిక్కించుకోవాలని రెండు జట్ల కెప్టెన్లు కృతనిశ్చయంతో ఉండడంతో సిరీస్ లో ఆఖరిపోరాటం రసవత్తరంగా మారనుంది.

  • Loading...

More Telugu News