: అందుకే కేసీఆర్ ను చంద్రబాబు అందలం ఎక్కించారు: వైకాపా


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజనకు కారణమైన తెలంగాణ ముఖ్యమంత్రిని చంద్రబాబు అందలమెక్కించారని... కేవలం ఓటుకు నోటు కేసు నుంచి బయటపడటానికే ఇదంతా చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తో చంద్రబాబు లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురమ్మంటే... ప్రధాని చేత మట్టి, నీరు తెప్పించారని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో చెరుకు పంటను తగులపెట్టించారని... ఈ అంశంపై విచారణ జరిపించేందుకు వైకాపా ఒక బృందాన్ని పంపనుందని తెలిపారు.

  • Loading...

More Telugu News