: వివాదాస్పదమవుతున్న 'శ్రీమంతుడు' కథ
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన 'శ్రీమంతుడు' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా కథ వివాదాస్పదం అవుతోంది. ఈ కథ తనదే అంటూ సినీ రచయిత శరత్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో ఈ సినిమాను తీయడానికి జయలక్ష్మి ఫిలింస్ వారికి ఈ కథను ఇచ్చానని చెప్పారు. తన 'చచ్చేంత ప్రేమ' కథనే కొన్ని మార్పులు చేసి దర్శకుడు కొరటాల శివ 'శ్రీమంతుడు' సినిమా తీశారని తెలిపారు. శ్రీమంతుడు రిలీజ్ టైమ్ లో తాను కేరళలో ఉన్నానని... తన మిత్రులు చెప్పడంతో సినిమా చూశానని, ఆ తర్వాత సినీ రచయితల సంఘంలో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. పరిశ్రమలోని కొంత మంది పెద్దలతో కూడా తన ఆవేదనను చెప్పుకున్నానని, అయినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. తనకు, జయలక్ష్మి ఫిలిమ్స్ అధినేత వెంకట్రావుకు న్యాయం చేయాలని శరత్ చంద్ర కోరారు.