: షరీఫ్... నువ్వు లాడెన్ మిత్రుడివే!: అమెరికాలో పాక్ ప్రధాని ఘెరావ్
అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు నిన్న నిరసన సెగ తగిలింది. తన సొంత దేశం బెలూచిస్థాన్ కు చెందిన ఓ నిరసనకారుడు షరీఫ్ ను ఘెరావ్ చేశాడు. అది కూడా అమెరికాలోని ప్రముఖ మేధో సంస్థ ‘యూఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీస్’లో ప్రసంగం సందర్భంగా ఈ నిరసన ఎదురుకావడంతో షరీఫ్ కంగుతిన్నారు. 'బెలూచిస్థాన్ కు విముక్తి కల్పించండి' అన్న నినాదంతో ఆందోళనకు దిగిన నిరసనకారుడు ‘‘నువ్వు లాడెన్ స్నేహితుడివే’’ అంటూ షరీఫ్ ను నిందించాడు. అంతేకాక, ‘ఫ్రీ బెలూచిస్థాన్’ అన్న పోస్టర్ ను కూడా సదరు నిరసనకారుడు ప్రదర్శించాడు. ఊహించని పరిణామంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తేరుకుని అతడిని బయటకు తీసుకెళ్లిన తర్వాత షరీఫ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.