: నెల్లూరులో రొట్టెల పండుగ షురూ... ఈ దఫా ‘అమరావతి’ రొట్టె కూడా ఉందట!


ఏపీలోని నెల్లూరులో మొహర్రం పర్వదినాల్లో ఏటా జరిగే రొట్టెల పండుగ నేటి తెల్లవారుజామున కోలాహలంగా ప్రారంభమైంది. నగర శివారులోని బారా షాహిద్ దర్గా సమీపంలోని చెరువు వద్ద ప్రారంభమైన రొట్టెల పండుగకు ఇప్పటికే భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఏటా జరుగుతున్న ఈ పండుగకు కుల, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇక ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఆ సమస్య పేరిటే భక్తులు రొట్టెలు పంపిణీ చేస్తుంటారు. ఇలా ‘పెళ్లి రొట్టె’, ఉద్యోగ రొట్టె’, ఆరోగ్యం రొట్టె’ తదితర రొట్టెలు ఇప్పటికే ఇక్కడ ప్రసిద్ధి. తాజాగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి శుభం కలగాలని కోరుతూ ‘అమరావతి రొట్టె’ను ప్రవేశపెడుతున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News