: వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి...లోన్ ఇవ్వండి... కెనరా బ్యాంకుకు దరఖాస్తు పెట్టిన యువకుడు


'వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి, నామినేషన్, డిపాజిట్, ప్రచార ఖర్చులకు డబ్బులు లేవు కనుక లోన్ ఇప్పించండి' అంటూ కెనరా బ్యాంకును ఆశ్రయించాడో అభ్యర్థి. వివరాల్లోకి వెళ్తే...హైదరాబాదులో జనసంక్షేమ సంఘం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన నారాయణ అనే పాతికేళ్ల యువకుడు నల్లకుంటలోని కెనరా బ్యాంకుకు వెళ్లాడు. వరంగల్ ఉపఎన్నికల్లో పోటీ చేయాలి, నామినేషన్ వేసేందుకు, డిపాజిట్ చేసేందుకు, ప్రచార ఖర్చుల కోసం రుణం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. తనలో రాజకీయ చైతన్యం మెండుగా ఉందని, 2014 ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని ఆయన దరఖాస్తులో పేర్కొన్నారు. కాగా, ఆయనకు రుణం మంజూరయ్యేది, లేనిది చెప్పేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు.

  • Loading...

More Telugu News