: పది శాతం పెరిగిన ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలు


ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పది శాతం మేర పెంచినట్టు ప్రభుత్వం తెలిపింది. పెంచిన ఛార్జీలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాదు నుంచి విజయవాడకు ఎక్స్ ప్రెస్ లో 213 రూపాయలు గా ఉన్న ఛార్జీలు 235 రూపాయలకు పెరిగాయి. డీలక్స్ బస్సుల్లో హైదరాబాదు నుంచి విజయవాడకు 240 రూపాయలుగా ఉన్న ఛార్జీలు 264 రూపాయలకు పెరిగాయి. సూపర్ లగ్జరీ బస్సుల్లో హైదరాబాదు నుంచి విజయవాడకు 283 రూపాయలుగా ఉన్న ఛార్జీ 303 రూపాయలకు పెరిగింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News