: గణితశాస్త్రంలోనే ఇది అద్భుతఘట్టం: నాని
'గణితశాస్త్రంలోనే అద్భుతమైన ఘట్టం ఎలా సాధ్యమైంది?' అంటూ సినీ నటుడు నాని తన అభిమానులను ప్రశ్నించాడు. ఆ వివరాల్లోకి వెళితే, 'భలే భలే మగాడివోయ్' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ 50 రోజులకు చేరుకుంది. దీంతో "హౌ...ఆ...హౌ? నేటికి 50 రోజులు అయింది ...మేము సినిమా తీశాం...దానిని మీరు బ్లాక్ బస్టర్ చేశారు... ఇది గణితశాస్త్రంలో అద్భుత ఘట్టం" అని తనదైన శైలిలో పేర్కొన్నాడు. కాగా, ఈ సినిమాలో నాని మతిమరుపు వ్యక్తిగా నటించి ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నాడు.