: ప్రత్యేక హోదా, ప్యాకేజీ అడిగా: చంద్రబాబు


రాష్ట్ర విభజన రాజకీయ కారణాలతో చేసిన విభజన అని, ప్రజలు కోరుకున్న విభజన కాదని ప్రధాని తిరుపతి సభలోను, అమరావతిలోనూ ప్రస్తావించిన విషయం అంతా గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, మీ వెంట నేనున్నానని, భుజం భుజం కలిపి నడుద్దామని ప్రధాని చెప్పారని ఆయన తెలిపారు. విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని ప్రధాని చెప్పిన సంగతి మరువొద్దని ఆయన సూచించారు. అందులో భాగంగానే ఆయన రాజధానిలో భాగమయ్యానని చెప్పేందుకు మన నీరు, మన మట్టి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. అన్ని అవాంతరాలను అధిగమించి విజయం సాధిద్దామని ప్రధాని తెలిపారని ఆయన వెల్లడించారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని ప్రకటించిన ప్రత్యేకహోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పానని ఆయన తెలిపారు. తెలంగాణకు హైదరాబాదు, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు వంటి మెట్రో నగరాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ కు కూడా అలాంటి పట్టణాన్ని నిర్మించాలని ప్రధానిని కోరానని ఆయన తెలిపారు. వీటన్నింటినీ పక్కన పెట్టి రాజధాని నిర్మాణం ఇష్టం లేని వారు ఆందోళనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వీరికి ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యమని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంలో రెండు దేశాలు భాగస్వాములవుతాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News