: వరంగల్ ఉప ఎన్నికలో కోడ్ పక్కాగా అమలవుతుంది: భన్వర్ లాల్
వరంగల్ ఉపఎన్నికల్లో ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వరంగల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 14, 75, 311 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. 2015 జనవరి 17 తరువాత ఇక్కడ 33,222 మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికను 1,751 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనున్నామని ఆయన వివరించారు. ఎక్కడైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.