: ఇండియాలో బులెట్ రైళ్లకు పెట్టుబడి, నిర్మాణం... టెండర్ వేసిన జపాన్


కేవలం ఒక్క రూపాయి కన్నా తక్కువ వడ్డీకి పెట్టుబడి పెట్టడంతో పాటు ముంబై, అహ్మదాబాద్ నగరాల మధ్య బులెట్ ట్రైన్ నిర్మాణానికి ఆసక్తిని చూపుతూ జపాన్ సంస్థ బిడ్ ను దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ బిడ్ వేసినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ నేడు వెల్లడించింది. దాదాపు రూ. 90 వేల కోట్ల అంచనా వ్యయం గల ప్రాజెక్టులో భాగంగా 505 కిలోమీటర్ల దూరం రైల్వే ట్రాక్ నిర్మాణం కానుందని, ఈ ట్రాక్ పై గంటకు 300 నుంచి 350 కి.మీ వేగంతో రైళ్లు ప్రయాణిస్తాయని తెలిపింది. కాగా, ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ నగరాల మధ్య దాదాపు 7 గంటలకు పైగా సాగుతున్న రైలు ప్రయాణం బులెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే రెండు గంటలకు తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News