: టీడీపీ ముఖ్యనేతలతో బాబు భేటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో ఆయన పార్టీ ముఖ్యనేతలతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసిన విధంగానే, రాజధాని నిర్మాణంలో కూడా భాగస్వాములను చేయడం ఎలా? చేస్తే ఎలా ఉంటుంది? వంటి అంశాలను వారితో చర్చిస్తున్నారు. చారిత్రక ఘట్టం పూర్తయిన నేపథ్యంలో కార్యక్రమంపై నేతల అభిప్రాయాలు కూడా తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News