: సహచరులపై మండిపడ్డ రాజ్ నాథ్ సింగ్


కేంద్ర మంత్రి వర్గ సహచరులు, బీజేపీ నేతల తీరుపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాద్రీ ఘటనను వీకే సింగ్ కుక్కలతో పోల్చడంపైన... నిబంధనలు ఉల్లంఘించడాన్ని ఉత్తర భారతీయులు గర్వంగా భావిస్తారంటూ కిరణ్ రిజిజు వ్యాఖ్యానించడంపైన ఆయన మండిపడ్డారు. బాధ్యతగా వ్యవహరించాలని ఆయన వారికి హితవు పలికారు. ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తరువాత తమ వ్యాఖ్యలు వక్రీకరించారని చెప్పి తప్పించుకోవడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారు తమ ఉద్దేశాలను ప్రజల ముందు ఉంచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News