: 'అమృత్'లోకి అమరావతి, రూ. 663 కోట్లు ప్రకటించిన కేంద్రం
కేంద్రం అమృత్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయాలని నిర్ణయించిన నగరాల జాబితాలోకి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కూడా చేరిపోయింది. అమరావతిని అమృత్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తామని కేంద్రం వెల్లడించింది. అమృత్ స్కీం కింద ఎంపికైన నగరాల అభివృద్ధి నిమిత్తం ఏపీకి రూ. 663 కోట్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిధుల్లో నీటి సరఫరాకు రూ. 646 కోట్లను, పార్కుల అభివృద్ధికి రూ. 17 కోట్లను ఖర్చు చేయాలని సూచించింది. ఏపీలోని 26 పట్టణాలకు అమృత్ పథకం కింద నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.