: ఇద్దరు ‘చంద్రు’ల కలయిక నూతన శకానికి నాంది: కేంద్ర మంత్రి దత్తాత్రేయ వ్యాఖ్య


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుల మధ్య నిన్న జరిగిన కలయిక నూతన శకానికి నాంది లాంటిదేనని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నిన్న గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలోని ఉద్ధండరాయునిపాలెంలో జరిగిన నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనలో రెండు రాష్ట్రాల సీఎంలు పాలుపంచుకున్నారు. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్ తన కేబినెట్ లోని ముగ్గురు మంత్రులతో కలిసి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హోదాలో దత్తన్న కూడా హాజరయ్యారు. నేటి ఉదయం హైదరాబాదులో ఆయన ‘అలయ్... బలయ్’ పేరిట ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇద్దరు సీఎంలతో పాటు పలువురు ప్రముఖులను కూడా దత్తన్న ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ఓ చానల్ తో మాట్లాడుతూ చంద్రబాబు, కేసీఆర్ ల భేటీని ప్రస్తావించారు. వారిద్దరి కలయిక ప్రజల్లో ఉత్సాహం నింపిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ల కలయికతో తెలుగు రాష్ట్రాల మధ్య ఉల్లాసభరిత వాతావరణం నెలకొందని కూడా దత్తన్న చెప్పారు.

  • Loading...

More Telugu News