: ఐక్యరాజ్యసమితిలో భారత్ ను అడ్డుకునేందుకు లంచాలిచ్చిన చైనా!


ఐరాస చేపట్టిన సంస్కరణలను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు చైనా భారీఎత్తున ముడుపులను ఉన్నతాధికారులకు ముట్టజెప్పింది. యూఎన్ జనరల్ అసెంబ్లీ మాజీ అధ్యక్షుడు జాన్ ఆషే అరెస్టు తరువాత మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. యూఎస్ అటార్నీ జనరల్ ప్రీట్ భరారా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల ఆరంభంలో జాన్ ఆషేకు చైనా వ్యాపారవేత, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి 1.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.5 కోట్లు) లంచంగా అందింది. మకావులో ఐరాస స్పాన్సర్ చేసిన సదస్సుకు చైనా నుంచి మరింతమంది వ్యాపారవేత్తలను ఆహ్వానించేందుకు ఆషేకు వందలాది డాలర్లు కూడా అందాయి. కాగా, జాన్ ఆషేకు అందిన ముడుపుల వివరాలన్నీ ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదని తెలుస్తోంది. ఐరాస కార్యక్రమాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని చైనా ప్రయత్నించిందనడానికి కావాల్సినంత సాక్ష్యం తమ వద్ద ఉందని, ఐరాసను ప్రభావితం చేయాలని, సంస్కరణలను ఆలస్యం చేయాలన్నది ఆ దేశ ఉద్దేశమని భరారా వెల్లడించారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సంస్కరణలు తేవాలని, ఇండియాకు సభ్యత్వం కల్పించాలని జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నదే చైనా ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఐరాస ప్రస్తుత కార్యదర్శి బాన్ కీ మూన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని యూఎన్ ప్రతినిధి స్టీఫానే డుజారిక్ తెలిపారు. ఐరాసలో లంచాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News