: ఎంసీఎల్ లోకి దూకుతున్న సంజయ్ దత్...జట్టు కొనుగోలుకు సన్నాహాలు


బాలీవుడ్ స్టార్లకు క్రీడాసక్తి నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కోల్ కతా నైట్ రైడర్స్ ను చేజిక్కింకుచుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటాడు. ఇక చోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్ కబడ్డీ లీగ్ తో పాటు ఫుట్ బాట్ లీగ్ లోనూ జట్లను కొనుగోలు చేసి దేశంలో ఆ రెండు క్రీడలకు మరింత ప్రాచుర్యం కల్పించడంలో సఫలీకృతులయ్యాడు. చోటా బచ్చన్ బాటలోనే జాన్ అబ్రహాం ఫుట్ బాల్ లీగ్ లో మరికొందరి భాగస్వామ్యంతో ఓ జట్టును దక్కించుకున్నాడు. తాజాగా సంజయ్ దత్ వంతు వచ్చింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి దోషిగా తేలిన సంజయ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. వచ్చే ఏడాది చివరికి గాని అతడు విడుదలయ్యే అవకాశాలు లేవు. అయితే అతడి తరఫున అతడి భార్య మాన్యత త్వరలో ప్రారంభం కానున్న మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్)లో చక్రం తిప్పుతోంది. దుబాయిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తమకు క్రీడల పట్ల ఆసక్తి ఉందని ప్రకటించింది. తమ కుటుంబంలో సంజయ్ దత్ క్రీడలకు సంబంధించి మరింత ఆసక్తి కనబరుస్తారని చెప్పింది. అంతేకాక, ఎంసీఎల్ లో ఓ జట్టును కొననుగోలు చేస్తున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు. సంజయ్ దత్ జైలు నుంచి బయటకు వచ్చేదాకా తాము కొనుగోలు చేసే జట్టు వ్యవహారాలను ‘సీఏఏ క్వాన్’ అనే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు అప్పగించనున్నట్లు కూడా మాన్యత చెప్పారు.

  • Loading...

More Telugu News