: ‘గల్లా’ వ్యాఖ్యలపై చంద్రబాబు గుస్సా... పార్టీ నేతలతో భేటీలో చర్చ తప్పదా?


గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ వినిపించిన నిరసన గళం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్దకు చేరిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంపై నిరసన వినిపించడమే కాక ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండి ఏమీ సాధించలేమని కూడా గల్లా వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తి స్ధాయిలో సమాచారం అందుకున్న చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం రాజధాని కమిటీ సభ్యులతో భేటీ కానున్న చంద్రబాబు, ఈ వ్యాఖ్యలపైనా చర్చించే అకాశాలున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు గల్లా వ్యాఖ్యలపై పెద్దగా చర్చ జరగకున్నా, రాజధాని కమిటీ భేటీ ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

  • Loading...

More Telugu News