: ఆంధ్రప్రదేశ్ పర్యటనపై మోదీ ట్వీట్ల స్పందన... ఏమంటున్నారంటే!


నిన్నటి అమరావతి నగర శంకుస్థాపన, ఆపై తిరుమల పర్యటనలపై తన అభిప్రాయాలను ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ల ద్వారా భారత ప్రజలతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపిందని, ప్రపంచ స్థాయి నగరం నిర్మించేందుకు ముందడుగు వేసిన ప్రభుత్వానికి, ప్రజలకు అభినందనలని ఆయన తెలిపారు. ఆపై వరుస ట్వీట్లు చేస్తూ, అమరావతికి యమునా నీటిని, పార్లమెంటులోని మట్టిని తీసుకెళ్లి అందించానని, అక్కడ కొన్ని తెలుగు మాటలు మాట్లాడానని తెలిపారు. అమరావతి అభివృద్ధికి సహకరిస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు. తిరుమలలో బాలాజీని దర్శించుకుని ప్రార్థనలు జరిపానని, అక్కడి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్ ను ప్రారంభించానని, దీంతో యాత్రికులకు, ప్రయాణికులకు మరింత సౌకర్యం దగ్గర కానుందని అన్నారు. ఏపీలో మరో కొత్త సంస్థ శ్రీ వెంకటేశ్వరా మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ కు శంకుస్థాపన చేసినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News