: న్యూఢిల్లీలో ఒక్క కారూ రోడ్డెక్కలేదు... తొలి కార్ ఫ్రీ డే!


నానాటికీ పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తొలి 'కార్ ఫ్రీ డే'ను దేశ రాజధాని ప్రజలు నిన్న పాటించారు. దీంతో ఢిల్లీ రోడ్లపైకి ఒక్క కారును కూడా ప్రజలు తీసుకురాలేదు. అత్యవసరమైన వారు, ప్రయాణాల నిమిత్తం ముందుగా కుదుర్చుకున్న ప్రైవేటు టాక్సీలను మాత్రం మినహాయించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తో పాటు, ఆప్ మంత్రులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఢిల్లీ కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఢిల్లీలో ప్రతి గురువారం నాడు కార్ ఫ్రీ డే అమలు చేయాలని ఆప్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News