: 11 నెలలకే పెళ్లి, 19 ఏళ్లకు విడాకులు... రూ. 16 లక్షల జరిమానా, కుల బహిష్కరణ శిక్ష!


ఆ యువతి పేరు శాంతాదేవీ మేఘ్వాల్, టీచర్ కావాలన్నది ఆమె కల. అందుకు తగ్గట్టుగానే కష్టపడి చదువుతోంది. మరికొన్ని నెలల్లో తన కల నెరవేరుతుందనగా, కఠోర సత్యం ఒకటి బయటపడింది. ఆమెకు 11 నెలల వయసున్నప్పుడు 28 ఏళ్ల శాంతారామ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిందని... అత్తింటి వారు వచ్చి కూర్చున్నారు. అమ్మాయిని కాపురానికి పంపాలని కోరుతున్నారు. తండ్రి సైతం అందుకు అంగీకరించాడు. తన కూతురు ఈ పెళ్లిని అంగీకరిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపాడు. అయితే, 46 ఏళ్ల వ్యక్తిని భర్తగా స్వీకరించేందుకు ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. దీంతో సంప్రదాయాలను కాదన్నందుకు ఆమె కుల బహిష్కరణ శిక్షకు గురవ్వాల్సి వచ్చింది. అంతేకాదు, రూ. 16 లక్షల జరిమానా కూడా కట్టాలని స్థానిక పంచాయతీ తీర్పిస్తే, దాన్ని కూడా కట్టింది. ఈ ఘటన బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్న రాజస్థాన్ లోని జోధ్ పూర్ సమీపంలో జరిగింది. అప్పటికీ బెదిరింపులు ఆగలేదు. వాటిని ఎదుర్కొనేందుకు అక్కడి ఓ ట్రస్టును ఆశ్రయించి, వారి సహాయంతో, తమ పెళ్లిని రద్దు చేయాలని జోధ్ పూర్ ఫ్యామిలీ కోర్టును కోరింది. కోర్టు సైతం మేఘాదేవి వైపు నిలిచి, చిన్నతనంలో జరిగిన వివాహం చెల్లదని తీర్పిచ్చింది. తన జీవితంలో ఇదో అద్భుతమైన రోజంటూ, తన కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తానని చెబుతోంది. ఆల్ ది బెస్ట్ మేఘా!

  • Loading...

More Telugu News