: ఓరుగల్లు పోలీసుల జులుం...జీపునకు అడ్డొచ్చాడని యువకుడిని చితకబాదిన ఎస్సై...అవమానభారంతో బాధితుడి సూసైడ్


వరంగల్ జిల్లా పోలీసులు తమదైన ఖాకీ జులుంను మరోమారు ప్రదర్శించారు. కేవలం వాహనానికి అడ్డుగా వచ్చాడన్న చిన్న కారణంతో ఓ యువకుడిని స్టేషన్ కు పిలిచి చితకబాదారు. దీంతో అవమానం భరించలేక సదరు యువకుడు సెల్ టవర్ ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నేటి ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన ఒక్క వరంగల్ జిల్లాలోనే కాక యావత్తు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే... వరంగల్ జిల్లా మరిపెడ ఎస్సై కృష్ణకుమార్ ప్రయాణిస్తున్న వాహనానికి కృష్ణ అనే యువకుడు అడ్డుగా వచ్చాడట. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడైన ఎస్సై సదరు యువకుడిని స్టేషన్ కు పిలిచి చితకబాదారు. అనంతరం స్టేషన్ నుంచి బయటకు వచ్చిన బాధితుడు అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెనువెంటనే సమీపంలోని సెల్ టవర్ వద్దకెళ్లి దాని పైకి ఎక్కాడు. జనం గమనించేలోగానే అతడు కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అంతెత్తు నుంచి కింద పడ్డ బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బాధితుడి శవంతో స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో మరిపెడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News