: ఎట్టకేలకు వీడిన భాగస్వామ్యం...డివిలియర్స్ వీరవిహారం


చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా బౌలర్లను విసిగిస్తున్న డివిలియర్స్, బెహర్థిన్ జోడీ ఎట్టకేలకు వీడింది. 300 పరుగుల విజయ లక్ష్యంతో సౌతాఫ్రికా ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. కీపర్ డికాక్ బౌలర్లపై దాడి ప్రారంభించాడు. మరో ఎండ్ లో ఆమ్లా, డుప్లెసిస్ లు వెనుదిరగడంతో ధాటిగా ఆడే క్రమంలో డికాక్ కూడా పెవిలియన్ చేరాడు. డివిలియర్స్ కు మిల్లర్ జత కలిశాడు. ఇంతలో హర్భజన్ సింగ్, అక్సర్ పటేల్ రంగప్రవేశం చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. మిల్లర్ అవుటయ్యాడు. డివిలియర్స్ కు బెహర్థిన్ జతకలిశాడు. కట్టుదిట్టమైన బంతులతో భజ్జీ, అక్సర్ దాడి చేయడంతో బంతులు తరిగిపోయి, లక్ష్యం పెరిగింది. ఇంతలో వీరి స్పెల్ ముగిసిపోవడంతో, సుమారు పది సార్లు ప్రాణదానం పొందిన డివిలియర్స్, బెహర్థిన్ లు జూలు విదిల్చిన సింహాల్లా విరుచుకుపడ్డారు. బౌండరీలతో గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ అభిమానులను ఆందోళనలోకి నెట్టారు. ఇంతలో అద్భుతమైన బంతితో బెహర్థిన్ ను అమిత్ మిశ్రా పెవిలియన్ చేర్చాడు. దీంతో డివిలియర్స్ కి క్రిస్ మోరిస్ జత కలిశాడు. వీరిద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. 38 ఓవర్లకు సౌతాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భజ్జీ రెండు, అక్సర్, మోహిత్, మిశ్రా చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News