: ఆరోగ్యం కోసం ఇదో రకం నడక!
నాగరిక సమాజంలో అన్నీ కలుషితమైపోతుండడంతో అనారోగ్యాలు కూడా తొందరగానే చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలు చిత్రవిచిత్రమైన చిట్కాలు అవలంబిస్తున్నారు. కొంత మంది వ్యాయామం, యోగా వంటి వాటిని నమ్మకుంటే... మరి కొందరు ఇతర పద్ధతులు పాటిస్తున్నారు. అలాగే, చేతులు నేలకు ఆనించి జంతువుల్లా నడవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చైనాలోని జెన్ జౌలోని షాంగ్ సిటీ ఆర్కియాలజీ పార్కులోని కొందరు సందర్శకులు కొద్దిసేపు ఈ మాదిరిగా జంతువుల్లా నడిచారు. ఈ దృశ్యం అక్కడి ఇతర సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.