: దత్తత గ్రామంలో కేసీఆర్ సందడి... గ్రామస్థులపై వరాల జల్లులు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలో దత్తత తీసుకున్న ఎర్రవెల్లి గ్రామంలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో అలయ్ బలాయ్ నిర్వహించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి, గ్రామానికి వరాల జల్లు కురిపించారు. గ్రామంలో శిథిలమైన 104 ఇళ్లను తొలగించి, 284 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు 32.54 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఆయన వెల్లడించారు. గ్రామీణ వాతావరణానికి సరిపడా సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం చేస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు మీనాక్షి అనే నిర్మాణ సంస్థతో ఒప్పందం కూడా పూర్తయిందని ఆయన చెప్పారు. అయితే, ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు గ్రామస్థులు షెడ్లలో ఉండాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. గ్రామంలో గిడ్డంగులు, గ్రంధాలయం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, కమ్యూనిటీ హాల్, బ్యాంకు తదితర సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News