: వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్...సఫారీల లక్ష్యం 300
టీమిండియా వరుసగా విరాట్ కోహ్లీ (138), హర్భజన్ సింగ్ (0) వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే శిఖర్ ధావన్ (7), రోహిత్ శర్మ (21) వికెట్లు కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రహానే (45) నిలదొక్కుకున్నారు. అర్ధసెంచరీ చేరువలో రహానే వెనుదిరగడంతో రైనా (53) అండగా కోహ్లీ చెలరేగాడు. ఆచితూచి ఆడుతూ వీరిద్దరూ స్కోరు బోర్డును ముందుకు ఉరికించారు. ఆటలో వేగం పెంచే క్రమంలో రైనా పెవిలియన్ చేరగా, ధోనీ (15) ఆకట్టుకోలేకపోయాడు. హర్భజన్, భువనేశ్వర్ కుమార్ లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 299 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో స్టెయిన్, రబడా చెరో మూడు వికెట్లు తీయగా, ఒక వికెట్ తీసి మోరిస్ వారికి చక్కని సహకారమందించాడు. కాసేపట్లో 300 పరుగుల విజయ లక్ష్యంతో సఫారీలు బ్యాటింగ్ ప్రారంభించనున్నారు.