: అమరావతి నిర్మాణంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది: ఈశ్వరన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అన్నారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ స్వాగతించారని చెప్పారు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను తక్కువ కాలంలో పూర్తి చేశామని చెప్పారు. భారత్ - సింగపూర్ మధ్య సంబంధాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. అంతకుముందు "ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు" అంటూ తెలుగులో పలకరించి అందరినీ ఆనందానికి గురిచేశారు.