: సంచలన వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్


ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాద్రి లాంటి ఘటనల వల్ల దేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలకు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. అది చాలా చిన్న విషయమని కొట్టి పారేశారు. ఇలాంటి ఉదంతాల వల్ల దేశ ప్రతిష్టకు వచ్చే నష్టమేమీ లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతంగా పాలిస్తున్నారని కితాబిచ్చారు. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపడ్డాయని తెలిపారు. నాగపూర్ లో ఈ రోజు జరిగిన దసరా ఉత్సవాల్లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మోహన్ భగవత్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News