: పార్లమెంటు నుంచి మట్టిని, యమున నుంచి నీటిని ఎందుకు తెచ్చానో తెలుసా?: మోదీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ఓ అపురూప బహుమతిని తనతో పాటు తీసుకొచ్చారు. పార్లమెంటు నుంచి మట్టిని, యమునా నది నుంచి నీటిని ఆయన తీసుకొచ్చారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, రాజధాని ఢిల్లీ నుంచి తాను తీసుకొచ్చింది కేవలం మట్టి, నీరు మాత్రమే కాదని... అమరావతిలో కలపడానికి సాక్షాత్తు దేశ రాజధానినే తీసుకువచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు కేరింతలు కొట్టారు. తాను చంద్రబాబుకు మట్టి, నీరు అందిస్తున్నప్పుడు చంద్రబాబు చాలా ఉద్వేగానికి లోనయ్యారని మోదీ తెలిపారు.