: తెలుగులో విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన మోదీ
తెలుగు ప్రజల మనసులను దోచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శతథా యత్నించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాత వేదికపైకి వచ్చిన మోదీ ‘మన మట్టి, మన నీరు’ పదాలను తెలుగులో ఉచ్చరించారు. అంతేకాక మహాకవి శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానాన్ని కూడా ప్రస్తావించారు. చివరగా తన ప్రసంగం మొదలుపెట్టిన ఆయన ఆదిలోనే తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అది కూడా అచ్చమైన తెలుగులో. ‘‘సోదర సోదరీమణులకు విజయ దశమి శుభాకాంక్షలు’’ అంటూ మోదీ పేర్కొన్నారు. పలుమార్లు మోదీ నోట తెలుగు పదాలు దొర్లడంతో జనం కేరింతలు కొట్టారు.