: మోదీ నోట శ్రీశ్రీ మాట... తెలుగులో ఉచ్చరించి ఆశ్చర్యపరచిన ప్రధాని
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ తెలుగు ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. శాస్త్రోక్తంగా అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీ ఆ తర్వాత వేదికపైకి వచ్చిన తర్వాత తన వెంట తీసుకువచ్చిన పార్లమెంటు ప్రాంగణంలోని మట్టి, యమునా నదీజలాన్ని చంద్రబాబుకు అందిస్తున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మన మట్టి, మన నీరు’ అనే పదాలను ఆయన తెలుగులో ఉచ్చరించారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ పేరు ప్రస్తావిస్తూ, ఆయన రచించిన మహాప్రస్థానంలోని ‘నేను సైతం’ అనే కవితను ప్రధాని ప్రస్తావించారు. తన వంతుగా పార్లమెంటు ప్రాంగణంలోని మట్టి, యమునా నదిని తీసుకువచ్చానని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని నోట తెలుగు మాట వినిపించడంతో కార్యక్రమానికి హాజరైన జనం జేజేలు పలికారు.