: రైతులకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా... చంద్రబాబు ఉద్వేగ ప్రసంగం


రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగించిన సందర్భంగా చంద్రబాబు ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. కొన్ని రాజకీయ పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వెనుకడుగు వేయని రైతులు తమపై నమ్మకముంచి భూములను అప్పగించారని ఆయన పేర్కొన్నారు. రైతులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా రాజధానిని నిర్మించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News