: నిర్దేశిత ముహూర్తానికే యంత్రన్యాసం... నవధాన్యాలతో ప్రతిష్ఠ చేసిన మోదీ


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనలో కీలక ఘట్టమైన యంత్రన్యాసం పూర్తయింది. నిర్దేశిత సమయం (మధ్యాహ్నం 12:37 గంటలకు) ప్రధాని నరేంద్ర మోదీ నవధాన్యాలతో యంత్రన్యాసాన్ని పూర్తి చేశారు. ఫొటో గ్యాలరీ సందర్శన అనంతరం నేరుగా యాగశాలకు చేరుకున్న మోదీ, పూజారులు చెప్పిన విధంగా యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News