: అమరావతిలో పారిశ్రామిక అభివృద్ధికి జపాన్ ప్రభుత్వంతో ఒప్పందం


అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో, జపాన్ ప్రభుత్వంతో ఈ రోజు ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. అమరావతిలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఉదయం విజయవాడలోని హోటల్ తాజ్ గేట్ వేలో ఎంవోయూ సమావేశం జరిగింది. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఇశోకె టాకాజీతో చంద్రబాబు చర్చించి ఎంవోయూ కుదుర్చుకున్నారు. దీంతో, అమరావతిలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా తొలి అడుగు పడినట్టయింది.

  • Loading...

More Telugu News