: అమరావతిలో టీ టీడీపీ యువ సంచలనం... ఆత్మీయ స్వాగతం పలికిన మాగుంట


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ ఉప నేత రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం ఉద్ధండరాయునిపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ఆయన చేరుకున్నారు. టీడీపీకి చెందిన పలువురు ఏపీ నేతలు రేవంత్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుర్చీలో నుంచి లేచి మరీ రేవంత్ రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. శంకుస్థాపన కోసం ఏపీ సర్కారు చేసిన ఏర్పాట్లను రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు.

  • Loading...

More Telugu News