: అమరావతి శంకుస్థాపనకు సతీసమేతంగా బాలీవుడ్ బిగ్ బీ... వెంకీ కూడా!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి రాజకీయ నేతలే కాక సినీ ప్రముఖులు కూడా క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన సతీమణి జయా బచ్చన్ తో కలిసి వచ్చారు. ఇక టాలీవుడ్ అగ్ర నటుడు విక్టరీ వెెంకటేశ్ కూడా ఉద్ధండరాయునిపాలెం చేరుకున్నారు. రెబల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునే కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు, సుమన్, ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తదితరులు కూడా వేదిక వద్దకు చేరుకున్నారు. శంకుస్థాపన సమయానికి మరింత మంది సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News