: గిన్నిస్ రికార్డులకెక్కనున్న ‘మై బ్రిక్స్-మై అమరావతి’... ఎంపీ కేశినేని నాని సంకల్పం


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన విరాళాల సేకరణ పథకం ‘మై బ్రిక్స్-మై అమరావతి’ త్వరలో గిన్నిస్ బుక్ రికార్డులకెక్కనుంది. రాజధాని నిర్మాణానికి మీ వంతు సహకారాన్ని అందించాలంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీనికి టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని మరో ఘనతను కట్టబెట్టేందుకు సంకల్పించారు. నేటి సాయంత్రం 6 గంటల నుంచి రేపు (శుక్రవారం) సాయంత్రం 6 గంటల్లోగా కనీసం 2 లక్షల ఇటుకలను దానమిప్పించే బృహత్ ప్రయత్నం మొదలుపెట్టనున్నారు. లక్ష మందితో ఒక్కొక్కరు కనీసం రెండు ఇటుకలు దానమిచ్చేలా నాని యత్నిస్తున్నారు. తద్వారా 24 గంటల్లో అత్యధిక మందితో దానమిప్పించి ‘మై బ్రిక్స్-మై అమరావతి’కి గిన్నిస్ లో చోటు దక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News