: గన్నవరంలో బారులు తీరిన లగ్జరీ కార్లు....‘అమరావతి’ అతిథుల కోసమేనట!
విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో నేటి ఉదయం నుంచి అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లు బారులు తీరాయి. ఫార్చూనర్లు మొదలుకుని రేంజ్ రోవర్ల దాకా వివిధ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లన్నీ అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం గన్నవరం ఎయిర్ పోర్టు పార్కింగ్ ప్లేస్ మొత్తం లగ్జరీ కార్లతోనే నిండిపోయింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రముఖులకు మర్యాదల్లో ఏమాత్రం లోటు చేయరాదని ఏపీ సర్కారు భావించింది. విమానాశ్రయం నుంచి అతిథులను వారికి కేటాయించిన హోటళ్లకు తరలించడం, అక్కడి నుంచి ఉద్ధండరాయునిపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తరలించేందుకు ఏపీ అధికారులు లగ్జరీ కార్లను వినియోగిస్తున్నారు.