: సందడి షురూ!... అమరావతి ‘వేదిక’ వద్దకు ప్రజల రాక ప్రారంభం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన వేదిక వద్ద సందడి మొదలైంది. నిన్నటికే ఏపీ సర్కారు ఏర్పాట్లన్నీ పూర్తి చేయగా, ఏపీ వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల నుంచి తుళ్లూరు పరిసరాల దరిచేరిన ప్రజలు కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. వేలాదిగా ప్రజలు ఉరకలెత్తే ఉత్సాహంతో వేదిక వద్దకు తరలివస్తున్నారు. తెల్లవారుజామున 5.30 గంటలకే వేదిక వద్దకు ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చేరుకున్నారు. మరోమారు ఆయన ఏర్పాట్లన్నింటినీ పరిశీలించారు. ఆ తర్వాత ప్రజల రాకకు పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసుల నుంచి అనుమతి లభించగానే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు వేదిక వద్దకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం అక్కడ కోలాహలం నెలకొంది.