: మహిళా కార్పొరేటర్ ను చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే


డామన్ లో బీజేపీ మేధోమథన సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే నవీన్ పాటిల్ ఓ హాల్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళా కార్పొరేటర్ ను ఏవో కామెంట్లు చేశారు. ఆమె వెనుదిరిగి చూడగా, ఆమె చెంపపై లాగిపెట్టి కొట్టారు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఇంతలో కొందరు మహిళలు ఎమ్మెల్యేను ఆపేందుకు ప్రయత్నించగా, మరి కొందరు కిందపడిన ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. పైకి లేచిన మహిళా కార్పోరేటర్ ఆ ఎమ్మెల్యేను కాలితో తన్నేందుకు ప్రయత్నించారు. ఇంతలో దగ్గరున్న వారు అడ్డుకోవడంతో, అతనికి దెబ్బలు తగల్లేదు. ఇది చూసిన ఆ ఎమ్మెల్యే ఆమె మీదికి దూసుకెళ్లి కాలితో తన్నేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయనను అక్కడున్నవారు అడ్డుకున్నారు. ఈ సన్నివేశాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News