: వైఎస్ జగన్ ని ఆహ్వానించినా రానంటున్నాడు: సీఎం చంద్రబాబు
‘అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి మా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినా రానంటున్నాడు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, శంకుస్థాపన కార్యక్రమం చారిత్రక ఘట్టమని, ఈ మహోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతినీ ఆహ్వానించామన్నారు. నవ్యాంధ్ర శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించామని, ఆయనేదో ఇస్తారని తాము ఆశించడం లేదన్నారు. 'తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మా ఆత్మీయ అతిథి' అని, రెండు తెలుగు రాష్ట్రాలూ అన్నదమ్ముల్లాంటివని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.