: నవంబర్ 21న వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక
తెలంగాణలోని వరంగల్ లోక్ సభ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28న నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 4వ తేదీ కాగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 7వ తేదీ. నవంబర్ 21న పోలింగ్ జరగనుంది. నవంబర్ 24న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాజీనామా చేసిన స్థానంలో ఎవరు ఎన్నికవుతారో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.