: ప్రధాని మోదీ పర్యటన ఇలా కొనసాగుతుంది...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న విషయం తెలిసిందే. మోదీ పర్యటన ఇలా కొనసాగుతుంది... * రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు మోదీ శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటారు * 12.30-35 వరకు అమరావతి గ్యాలరీ సందర్శన * 12.35-43 మధ్య శంకుస్థాపన పూజ * 12.43-45 మధ్య ప్రధాన వేదికపైకి చేరుకుంటారు * 12.45-48 మధ్య ప్రధానికి, అతిథులకు పుష్పగుచ్ఛాలు అందజేస్తారు * 12.48-50 మధ్య ‘మా తెలుగు తల్లి’ గీతం ఆలాపన * 12.50-53 మధ్య జపాన్ మంత్రి యోసుకే తకాగి ప్రసంగం * 12.53-56 మధ్య సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం * 12.56-1.01 మధ్య కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగం * 1.01-11 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం * 1.11-43 మధ్య ప్రధాని మోదీ ప్రసంగం * 1.43-46 మధ్య ప్రధానికి, అతిథులకు జ్ఞాపికలు అందజేత * 3.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు ప్రధాని చేరుకుంటారు * 3.31-34 మధ్య ఎయిర్ పోర్ట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ కు చేరిక * 3.34-42 మధ్య ఫొటో గ్యాలరీ సందర్శన * 3.43-45 మధ్య కొత్త టెర్మినల్ ప్రారంభం * 3.45-46 మధ్య మోదీకి జ్ఞాపిక అందజేత * 3.46-49 మధ్య హెలికాఫ్టర్ వద్దకు చేరుకోనున్న ప్రధాని * 3.50 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని ప్రయాణం * సాయంత్రం 4 గంటలకు కొత్తగా ఏర్పాటు చేయబోయే మొబైల్ కంపెనీల శంకుస్థాపన * 4.15 గంటలకు తిరుమలకు బయలుదేరి వెళ్లనున్న ప్రధాని * 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న ప్రధాని * 5 నుంచి 5.10 గంటల వరకు విశ్రాంతి తీసుకోనున్న ప్రధాని * 5.10 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరనున్న ప్రధాని * 5.15 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకోనున్న ప్రధాని * 5.15 నుంచి 6 గంటల వరకు శ్రీవారి సేవలో * 6 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి పద్మావతి గెస్ట్ హౌస్ కు * 6.15 గంటలకు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవడంతో ప్రధాని పర్యటన ముగుస్తుంది.