: ఆస్కార్ ఎవడిక్కావాలి?...నాకైతే అక్కర్లేదు: ప్రముఖ హాలీవుడ్ నటుడు
ఆస్కార్ పురస్కారం అందుకోవడం ప్రతి నటుడి కల...అలాంటి ఆస్కార్ ను తనకొద్దనేశాడు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ సినిమాల ద్వారా అత్యంత ఆదరణ పొందిన జానీ డెప్. ఆస్కార్ అవార్డు ఎవడిక్కావాలి? అని ఈ హాలీవుడ్ నటుడు ప్రశ్నించాడు. తనకైతే ఆస్కార్ అక్కర్లేదని స్పష్టం చేశాడు. స్టేజ్ మీదకి వెళ్లడం, వాళ్లకీ వీళ్లకీ కృతజ్ఞతలు చెప్పడం న్యూసెన్స్, నాన్సెన్స్ అని జానీ డెప్ అభిప్రాయపడ్డాడు. ఆస్కార్ నామినేషన్ కు రావడమంటేనే ఎవరికో పోటీ అని, తానెవరికీ పోటీ కాదని జానీ డెప్ పేర్కొన్నాడు. తనకసలు ఆస్కార్ అవార్డే అక్కర్లేదని తెలిపాడు.