: దృష్టి సమస్యలకు వీడియోగేమ్స్ విరుగుడు
ఆంబ్లియోపియా అనేది ఒక రకమైన కంటి రుగ్మత. వయోజనుల్లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. దీన్నే 'లేజీ ఐ' అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ రుగ్మతను వీడియోగేమ్స్ ఆడించడం ద్వారా నియంత్రించవచ్చునని పరిశోధకులు అంటున్నారు.
కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీకి చెందిన రాబర్ట్ హెన్ వయోజనులకు వీడియోగేం ఇచ్చి ఆడించడం ద్వారా వారిలో ఆంబ్లియోపియా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు కళ్లనీ బలవంతంగా ఒక దానికి ఒకటి సహకరించుకునేలా చేయడానికి ఈ వీడియో గేం ఇవ్వడం అనేది ఉపకరిస్తుందని ఆయన నమ్ముతున్నారు. దీనివలన మెదడులో నేర్చుకునే ప్రాసెస్ మళ్లీ మొదలవుతుందని.. రుగ్మత నయమయ్యే దిశగా ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఆయన అంటున్నారు.