: ‘సచిన్’ దత్తత గ్రామంలో విషజ్వరాలు
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న గ్రామం పుట్టంరాజు కండ్రిగలో విషజ్వరాలు వ్యాపించాయి. తాగునీరు కలుషితమైన కారణంగానే ఈ సమస్య తలెత్తింది. పుట్టంరాజు కండ్రిగలో ప్రస్తుతం తాగునీటి సౌకర్యం సరిగ్గా లేదని గ్రామస్థులు అంటున్నారు. అధికారులు కూడా గ్రామంలో పరిస్థితులను పట్టించుకోవడం లేదన్నది గ్రామస్తుల ఆరోపణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న పుట్టంరాజు కండ్రిగను దత్తత తీసుకున్న సచిన్ కు ఈ గ్రామ దుస్థితి గురించి తెలుసో, లేదో అని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో నెలకొన్న విష జ్వరాల సమస్య సచిన్ కు తెలిస్తే బాగుంటుందన్నారు.