: కాపులను విస్మరిస్తున్న చంద్రబాబు... డిసెంబర్ నుంచి ఉద్యమమే: ముద్రగడ పద్మనాభం
చంద్రబాబు పాలనలో కాపులకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపులను చంద్రబాబు విస్మరిస్తున్నారని అన్నారు. డిసెంబర్ నెలాఖరు కల్లా కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అదే విధంగా, కాపులకు రూ. వెయ్యి కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. లేని పక్షంలో డిసెంబర్ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.